Vijaya Sai Reddy: మహిళా సంఘాలపై ఎక్కడా ఒత్తిడి తీసుకురాలేదు
YSRCP Plenary 2022: మంగళగిరిలో రెండు రోజులపాటు ప్లీనరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని...
Vijaya Sai Reddy: మహిళా సంఘాలపై ఎక్కడా ఒత్తిడి తీసుకురాలేదు
YSRCP Plenary 2022: మంగళగిరిలో రెండు రోజులపాటు ప్లీనరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ ప్రతినిధులు, పార్టీ క్రియాశీలక కార్యకర్తలు ప్లీనరీకి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ఒత్తిడి చేస్తున్నట్లు విపక్షాల ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. ప్లీనరీకి డ్వాక్రా మహిళలను తరలిస్తున్నట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు మాత్రమే ప్లీనరీకి హాజరవుతారు. వారికే మేము ఆహ్వానం పంపాం తప్ప డ్వాక్రా మహిళలకు కాదు' అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.