తైక్వాండలో విజ్ఞాన్ విద్యార్థుల పతకాల పంట

వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి బంగారు పతాకాలు కైవసం చేసుకున్నారని విజ్ఞాన్ వర్శిటీ ఉపకులపతిడాక్టర్ ఎంవైఎస్. ప్రసాద్ వెల్లడించారు.

Update: 2020-02-12 09:58 GMT

చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి బంగారు పతాకాలు కైవసం చేసుకున్నారని విజ్ఞాన్ వర్శిటీ ఉపకులపతిడాక్టర్ ఎంవైఎస్. ప్రసాద్ వెల్లడించారు. మెడల్స్ పొందిన విద్యార్థులకు బుధవారం యూనివర్శిటీలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల విజయవాడలోని డిఆర్ఆర్ మున్సిపాల్ స్టేడియంలో జరిగిన ' ఫస్ట్ వైఎస్సార్ మెమోరియల్ ఏపీ స్టేట్ ఇన్విటేషనల్ తైక్వాండ్ కప్-2020' రాష్ట్ర స్థాయి పోటీల్లో విజ్ఞాన్ విద్యార్థులు పతాకాలు పొందారని వెల్లడించారు. అవార్డులు పొందిన విద్యార్థులను విజ్ఞాన్ సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్ సంస్థల ఉపాధ్యాక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్శిటీ రిజిష్ట్రార్ ఎంఎస్. రఘునాథన్,రెక్టర్ కె.సత్యప్రసాద్, స్టూడెంట్స్ డీన్ ఎఫైర్స్ రుక్మిణీ తదితరులు అభినందించారు.


Tags:    

Similar News