వేడెక్కిన గన్నవరం పాలిటిక్స్

Update: 2020-08-24 05:04 GMT

Vallabhaneni Vamsi vs Dutta Ramachandra Rao: గన్నవరం నియోజకవర్గం మంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ కొద్ది నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీలో చేరకపోయినా, చేరినట్టు గానే అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ వస్తున్నారు. వంశీ ఇలా చేస్తుండటంతో ఇప్పటి వరకూ నియోజకవర్గంలో వైసీపీలో కీలకంగా దుట్టా రామచంద్రారావు, పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

మరోవైపు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తానే వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడంతో నియోజకవర్గంలోని ఇద్దరు నేతల్లో అసంతృప్తి నెలకొంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన దుట్టా రామచంద్రారావు ఎమ్మెల్యే వంశీపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే అక్రమాలను అడ్డుకున్నందుకే తన అల్లుడికి బెదిరింపులు వచ్చాయని.. వంశీ సీఎం జగన్ కాళ్లు పట్టుకుని వైఎస్సార్‌సీపీలో చేరారని ఫైరయ్యారు. తనతో ఉన్నవారిని భయపెడుతున్నారని పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు, తనకు విభేదాలు లేవన్నారు. కావాలంటే గన్నవరం నుంచి తానే పోటీచేస్తానని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు 15 రోజుల్లో మంచి వార్త చెబుతాను అన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలతో గన్నవరం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.


Tags:    

Similar News