పార్టీ మార్పు విషయంపై యార్లగడ్డ స్పష్టత

Raj
By Raj
Updated on: 20 Nov 2019 12:52 PM IST
పార్టీ మార్పు విషయంపై యార్లగడ్డ స్పష్టత
X

పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చారు గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకటరావు. తాను అధినేత జగన్ కు విధేయుడినని.. పార్టీలు మారే మనస్తత్వం తనకు లేదని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై తనకు సమాచారం లేదని తేల్చారు. అలాగే తాను సీఎం జగన్‌ని కలిసినప్పుడు వంశీ ప్రస్తావనే రాలేదన్నారు. ఎవరు పార్టీలోకి వచ్చినా తన కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. భవిశ్యత్ లో జరగబోయే పరిణామాలకు సమాధానం చెప్పలేమన్నారు. జగన్‌తో పనిచేయాలన్న ఉద్దేశంతోనే అమెరికా నుంచి వచ్చేశానని.. తనకు అన్యాయం చేస్తాడని భావించట్లేదన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు వంశీ పంచిన ఇళ్ల పట్టాలు మాత్రం నకిలీవేనని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో 90 శాతం స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు.

కాగా గన్నవరం పంచాయితీ సోమవారమే ముగిసింది. జగన్ వద్ద వల్లభనేని వంశీ చేరికకు యార్లగడ్డ వెంకటరావు ఒకే చెప్పారు. అయితే తనకూ, తన కార్యకర్తలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అదే క్రమంలో పార్టీలో తన వర్గం కార్యకర్తలకు సముచిత స్థానం తోపాటు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గం వారికే 70 శాతం సీట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టినట్టు సమాచారం. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య .. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సయోధ్య కుదిర్చారు.

Raj

Raj

Next Story