Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్న టీటీడీ
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikunta Ekadasi 2023: తెలుగురాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమలకు భారీగా సంఖ్యలో భక్తులు రావడంతో.. వైకుంఠ ద్వార దర్శనం అనుమతించారు. వేకువజామునుంచే ప్రముఖులుదర్శించు కోగా.. ఉదయం 5 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ధ్వార దర్శనం కల్గించనున్నారు. జనవరి 1 వరకూ పదిరోజుల పాటు ఈ దర్శనానికి అనుమతించనున్నారు. దర్శనం టోకెన్, టికెట్ ఉన్న భక్తులను మాత్రమే..వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్న టీటీడీ పేర్కొంది.
మరోవైపు వైకుంఠ ఏకాదశి కావడంతో.. ఇటు సామాన్య భక్తులతో పాటు.. ప్రముఖులు సైతం.. క్యూ కడుతున్నారు. ఏడుగురు సుప్రీంకోర్ట్ జడ్జీలు, ఏపీ తెలంగాన, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు దర్శనం కోసం క్యూకట్టారు.