Vaikunta Ekadasi Tirumala: 10 రోజుల్లో 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం: టీటీడీ ఈవో

Vaikunta Ekadasi Tirumala: సామాన్య భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తున్నాం

Update: 2023-12-23 04:45 GMT

Vaikunta Ekadasi Tirumala: 10 రోజుల్లో 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం: టీటీడీ ఈవో

Vaikunta Ekadasi Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామునే ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న వైకుంఠ ద్వారం తెరిచారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులంతా చాలా సంతృప్తితో స్వామివారిని దర్శించుకుని.. ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏర్పాట్లు కూడా చేశామన్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించడం జరిగిందన్నారు. భక్తులను గంటన్నర ముందుగానే వైకుంఠంలో కూర్చోబెట్టి.. భక్తులకు దర్శనం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఒకవేళ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే పరిస్థితి వస్తే.. క్యూలైన్‌లోనే ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామన్నారు.

Tags:    

Similar News