మంత్రి పేర్నినానికి తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2020-11-29 09:31 GMT

ఏపీ మంత్రి పేర్నినానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిపై దాడికి యత్నం చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. కాళ్లకు దండం పెట్టేందుకు వచ్చి తాపీతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. దీంతో మంత్రి నానికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు నిందితుడిపై కేసు నమోదు చేశామన్న కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. దాడికి పాల్పడింది తాపీ పనిచేసే బడుగు నాగేశ్వరరావు అని గుర్తించామన్నారు. మద్యం మత్తులో దాడి చేశాడా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఘటనతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకుంది.

తనపై జరిగిన దాడి ఘటనపై మంత్రి నాని స్పందించారు. తన తల్లి దశదిన కర్మ జరుగుతుండడంతో అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఇంటికొచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి తన కాళ్లపై పడుతున్నట్లు ముందుకు వచ్చి తనపై దాడి చేసినట్లు వివరించారు. ఈ మొత్తం ఘటనలో అదృష్టవశాత్తు తనకు ఏం కాలేదన్న మంత్రి తాను క్షేమంగానే ఉన్నట్లు వివరించారు.

Tags:    

Similar News