పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Update: 2019-06-26 11:46 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్రానిదే అని మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు వివరించారు. స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను రెండేళ్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు. దీంతో పోలవరం నిర్మాణ పనులు ఎలంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయన్నారు. స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేయాలని చూశామని, కానీ కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉండడం వలన అది కుదరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రమే చూసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.Full View

Tags:    

Similar News