TDP: టీడీపీలో చేరనున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

TDP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని సస్పెన్షన్

Update: 2023-12-15 08:30 GMT

TDP: టీడీపీలో చేరనున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

TDP: ఏపీలో అధికార వైసీపీ పార్టీకి షాక్ ఇస్తూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. అయితే ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ నేడు అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖ‌ర్‌రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే వారిద్దరూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా కూడా కండువా వేసుకోకుండానే హాజరయ్యారు. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Tags:    

Similar News