Twitter War over YSR House Pattas: విజయసాయిరెడ్డి vs అయ్యన్నపాత్రుడు

Twitter War over YSR House Pattas: ఏపీలోని ఇళ్ల పట్టాల పంపిణీ పైన అధికార, ప్రతిపక్షాలు మధ్య పెద్ద వార్ నడుస్తుంది..

Update: 2020-07-07 08:27 GMT
Vijaya SaiReddy, Ayanna Patrudu (File Photo)

Twitter War over YSR House Pattas: ఏపీలోని ఇళ్ల పట్టాల పంపిణీ పైన అధికార, ప్రతిపక్షాలు మధ్య పెద్ద వార్ నడుస్తుంది.. తాజగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ఆయన్ను పాత్రుడు మధ్య ట్విట్టర్ వార్ బాగానే నడిచింది.. విజయసాయరెడ్డి తన ట్విట్టర్ వేదికగా "జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే" అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు..

విజయసాయిరెడ్డి ట్వీట్ కి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గట్టి కౌంటర్ ఇచ్చారు.. "వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ.సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం విడ్డురంగా ఉంది. పట్టాలు అమ్మకం,డబుల్ రేటుకి స్థలాలు కొనడం.అధికార పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజరుతూనే ఉన్నాడు" అంటూ ట్వీట్ చేశాడు..

ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా:

జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని  ప్రభుత్వం భావించింది. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇక ఈ ఆగష్టు 15న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. 




Tags:    

Similar News