TTD: టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుమార్ సింఘాల్
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త కార్యనిర్వహణాధికారి (ఈవో)గా అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త కార్యనిర్వహణాధికారి (ఈవో)గా అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు.
అనిల్‌కుమార్ సింఘాల్ ఈరోజు ఉదయం అలిపిరి మార్గం గుండా కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలయ ఆవరణలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రాన్ని కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కొత్త ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించడంతో టీటీడీలో కొత్త పాలన మొదలైంది.