Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
Bhumana Karunakar Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు పనితీరుపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
Bhumana Karunakar Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు పనితీరుపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు దారుణంగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ నాయుడు పనితీరును ఎద్దేవా చేస్తూ భూమన కరుణాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ" అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం బ్లాక్ టికెట్ల దందా యథేచ్ఛగా నడుస్తోందని భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఛైర్మన్ నాయుడు తిరుమలలో పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ తీసుకుంటున్న సాంకేతిక నిర్ణయాలపైనా భూమన కరుణాకర్‌రెడ్డి పెదవి విరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలను సులభతరం చేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.