BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులతో చైర్మన్ ఆత్మీయ సమావేశం
BR Naidu: తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భంధువులు అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
BR Naidu: తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భంధువులు అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులతో.. ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లో భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తెలిపారు. శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని బీఆర్ నాయుడు ఆకాంక్షించారు.