Tirumala: ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు భూమి పూజ
Sri Venkateswara Museum: తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఆధునీకరిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Tirumala: ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు భూమి పూజ
Sri Venkateswara Museum: తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఆధునీకరిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. మ్యూజియం ఆధునీకరణ పనులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మద్య శంకుస్ధాపన చేశారు. అనంతరం ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు సంబంధించి టీటీడీ అధికారులకు, టీసీఎస్ సంస్ధ ప్రతినిధులకు, మ్యాపింగ్ సిస్టం ప్రతినిధులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.