TTD Board Meeting: ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం..ఆ రోజు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు..!

TTD Board Meeting: ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం కానుంది.

Update: 2025-01-27 04:50 GMT

TTD Board Meeting: ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

TTD Board Meeting: ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం కానుంది. ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని పాలకమండలి భేటీ కానుండగా.. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమీక్ష జరపనున్నారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.

జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనుండగా.. ఫిబ్రవరి 3 నుండి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ రద్దు చేసింది టీటీడీ. దీంతో పాటు ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసింది.

Full View


Tags:    

Similar News