TTD: భక్తులకు మెరుగైన సేవలందించేందుకు టీటీడీ కొత్త ఫీడ్ బ్యాక్ విధానం .!

Dhivi
Updated on: 3 May 2025 10:34 AM IST
Tirumala Tickets
X

Tirumala Tickets

TTD: భక్తులకు మెరుగైన సేవలందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్ బ్యాక్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇకనుంచి భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని తెలిపింది. తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్స్ ను మొబైల్ తో స్కాన్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం ( అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్ , గదులు మొదలైనవి) ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత అభిప్రాయం తెలిపేందుకు టెక్ట్స్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు. సేవా ప్రయాణాన్ని ఉత్తమం, సగటు, మరింత మెరుగుదల అవసరం లేదా బాగలేదు వంటి వాటికి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయాలి. లేదంటే వీడియో రూపంలో అప్ లోడ్ చేయవచ్చు.

మీ అభిప్రాయాలను సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం నమోదు అవుతుంది. మీ విలువైన ఫీడ్ బ్యాక్ కు ధన్యవాదాలు అనే మెసేజ్ వస్తుంది. ఈ విధంగా భక్తులు నుంచి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోనికి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది.

Dhivi

Dhivi

Next Story