Tirumala: వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం ప్రవేశపెట్టిన టీటీడీ.. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని..

TTD Introduces WhatsApp Feedback System
x

Tirumala: వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం ప్రవేశపెట్టిన టీటీడీ.. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని..

Highlights

Tirumala: భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం తీసుకొచ్చింది.

Tirumala: భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం తీసుకొచ్చింది. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ వాట్సాప్ విధానం ద్వారా భక్తులు తమ అభిప్రాయాన్ని సులభంగా తెలియజేయవచ్చు. తిరుమలలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో భక్తులు వివరాలను ఎంచుకోవచ్చు.

భక్తులు తమ అభిప్రాయాలను 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయాలి లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చని టీటీడీ అధికారుల తెలిపారు. భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. సేవల ప్రమాణాన్ని పెంచేందుకు టీటీడీ అధికారులు తగిన చర్యలు తీసుకున్నామని టీటీడీ అధికారులు పత్రిక ప్రకటన విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories