TTD Chairman: శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలు రికార్డు స్థాయిలో ముగిసాయి
TTD Chairman: తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠద్వార దర్శనాలు ఈసారి కన్నుల పండువగా.. రికార్డు స్థాయిలో ముగిశాయి.
TTD Chairman: తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠద్వార దర్శనాలు ఈసారి కన్నుల పండువగా.. రికార్డు స్థాయిలో ముగిశాయి. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలు, దర్శన భాగ్యంపై చైర్మన్ బీఆర్‌నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తన చిన్నతనం నుండి ఇంత వైభవంగా వైకుంఠద్వార దర్శనాలు జరగడం ఎప్పుడూ చూడలేదన్నారు.
గత పది రోజుల్లో ఏకంగా 7 లక్షల 83 వేల మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారని.. టీటీడీ చేసిన ఏర్పాట్లపై 93 శాతం మంది భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం అన్నారు. అలాగే AI కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షించి సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.