AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

AP TET Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.

Update: 2026-01-09 12:31 GMT

AP TET Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఈ ఫలితాల వివరాలను అధికారికంగా వెల్లడించారు.

ఫలితాల గణాంకాలు:

మొత్తం దరఖాస్తుదారులు: 2,71,692 మంది

పరీక్షకు హాజరైన వారు: 2,48,427 మంది

ఉత్తీర్ణత సాధించిన వారు: 97,560 మంది

ఫలితాలను ఎలా చూడాలి?

అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు:

అధికారిక వెబ్‌సైట్: అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేయడం ద్వారా రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టెక్నాలజీని వాడుకుంటూ అభ్యర్థుల సౌకర్యార్థం 9552300009 అనే వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.

టెట్ ఫలితాలు విడుదల కావడంతో, అభ్యర్థులు ఇప్పుడు ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC)పై దృష్టి సారించారు. టెట్‌లో సాధించిన స్కోరుకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News