Anandayya: మందులో దుష్ప్రభావ పదార్థాలు లేవని వైద్యులు చెప్పారు- చెవిరెడ్డి

Anandayya Medicine: ఎస్వీ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రి వైద్యులతో టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి భేటీ అయ్యారు.

Update: 2021-05-23 08:55 GMT

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Ananadayya Ayurvedic Medicine: ఎస్వీ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రి వైద్యులతో టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి భేటీ అయ్యారు. వైద్యుల బృందంతో కలిసి ఆయుర్వేద ఔషదం పరిశీలించారు. ఆనందయ్య కరోనా మందులో దుష్ప్రభావ పదార్థాలు లేవని వైద్యలు చెప్పినట్లు చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఐసీఎంఆర్‌, ఆయుష్‌ నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు ఆయన. అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔషధం తయారీకి టీటీడీ సిద్ధంగా ఉందన్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి శేషాచల అడవుల్లో వనమూలికలు అందుబాటులో ఉన్నాయంటున్నారు.

నెల్లూరు కరోనా నాటు మందు పంపిణీ త్వరలోనే తిరిగి ప్రారంభంకానుంది. ఇక నాటు మందుకు ఉన్న అడ్డంకులు తొలిగిపోతున్నట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి. సీఎం జగన్‌ సహాకారంతో కోవిడ్‌ బాధితులకు, ప్రజలకు నాటు మందును పంపిణీ చేస్తామన్నారు. ఆయుష్‌ కూడా కరోనా నాటు మందును మెచ్చుకుందన్నారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి. ఇక ఎమ్మెల్యే కాకాని వల్లే తనకు పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కుకాలేదంటున్నారు ఆనందయ్య.

Tags:    

Similar News