TTD Board Meeting: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం
TTD Board Meeting Today: తిరుమలలో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.
TTD Board Meeting Today: తిరుమలలో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్యక్షతన కాసేపట్లో అన్నమయ్య భవనంలో సమావేశం కానుంది. 85పైగా అంశాలపై చర్చించి బోర్డు కీలక తీర్మానాలు చేయనుంది. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చించనున్నారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి పర్వదినాలుండగా శతాబ్దాల సంప్రదాయం ప్రకారం 2 రోజులా లేక గత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచాలా అనేదానిపై బోర్డు నిర్ణయం తీసుకొనుంది. టీటీడీ చేపట్టనున్న అభివృద్ధి పనులపై టీటీడీ బోర్డు తీర్మానం చేయనుంది.