Tirumala: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను సన్మానించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు

Tirumala: తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఈ సమావేశం నిర్వహించారు.

Update: 2025-09-16 08:53 GMT

Tirumala: తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఈ సమావేశం నిర్వహించారు. పాలకమండలి సమావేశంలో టీటీడీ నూతన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ పాలకమండలి చైర్మన్, సభ్యులు సత్కరించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, సీఎం పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమంపై ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనే అంశంపై చర్చించి, బ్రహ్మోస్తవాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పై చర్చ జగనుంది. అలాగే మరికొన్ని కీలకాంశాలపై చర్చించి తీర్మానం చేయనుంది టీటీడీ బోర్డు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయం వద్ద టిటిడి చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓ గవర్నర్ కు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో పండితులు వేద ఆశీర్వాదలు అందించగా.. టిటిడి చైర్మన్ తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags:    

Similar News