Tomato Price Hike: ఠారెత్తిస్తున్న టమాటా.. పెట్రోల్‌ని దాటేసింది..!

Tomato Price Hike: మార్కెట్‌లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి.

Update: 2021-11-24 06:56 GMT

Tomato Price Hike: ఠారెత్తిస్తున్న టమాటా.. పెట్రోల్‌ని దాటేసింది..!

Tomato Price Hike: మార్కెట్‌లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. మొన్నటి వరకు పెట్రోల్ ధరలతో జనం అల్లాడిపోయారు. కేంద్రం పన్నులు తగ్గించడంతో ధరలు కాస్త దిగొచ్చాయి. ఆ ధరల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న వేళ ఇప్పుడు టమాటా ధరలు కూడా చుక్కులు చూపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర 100 రూపాయలు దాటింది. కొన్ని చోట్ల 120 దాటేసింది. తాజాగా మదనపల్లి మార్కెట్‌లో రికార్డ్ స్థాయి ధరలకు చేరింది. కిలో టమాట 130 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో కూడా కిలో టమాటా 120 నుంచి 130 రూపాయల మధ్య ఉంది. చెన్నైలో మాత్రం 150 రూపాయలకు చేరింది. మరోవైపు రికార్డ్ స్థాయిలో ధరలు పలుకుతుండటంతో టమాటా రైతులను సంతోషపెడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో టమాటా అధికంగా సాగు చేస్తుంటారు. ఈ రెండు ప్రాంతాల్లోనే కాకుండా రాయలసీమ జిల్లాల్లో టమాటా గణనీయంగా సాగవుతుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా టమాటా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో సాగు, దిగుబడి తగ్గడంతో టమాటా రికార్డ్ ధర పలుకుతోంది.

Tags:    

Similar News