Today Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Today Weather Report: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తున్నాయి

Update: 2020-06-30 05:31 GMT

Today Weather Report: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది.ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోంది.

ఉపరితల ద్రోణి వల్ల చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు తెలిపింది. మంగళవారం మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఇక బుధవారం, గురువారాల్లోనూ కోస్తా, ఉత్తారాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే కురిసే అవకాశముందని ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. రాయలసీమలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచింది.

ఇటు తెలంగాణ లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఊరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే రాష్ట్రంలో మంగళ, బుధ వారాల్లో కూడా చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురవడంతో రెండు రాష్ట్రాల్లో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News