Weather Updates: రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు : వాతావరణ శాఖ

కొద్దిరోజులుగా నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగలంతా ఆకాశం మేఘావృతం అయి సాయంత్రానికి వర్షం పడుతోంది.

Sumitra
Updated on: 22 Jun 2020 12:06 PM IST
Weather Updates: రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు : వాతావరణ శాఖ
X

కొద్దిరోజులుగా నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగలంతా ఆకాశం మేఘావృతం అయి సాయంత్రానికి వర్షం పడుతోంది. ఇక ఇదే క్రమంలో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్‌ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంగుతోందని, దీని కారణంగా సోమవారం కొన్నిచోట్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కూడా ఇదే తరహాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇక ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు బలహాన పడడంతో రాష్ట్రంలో ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అదే విధంగా సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, 25న మాత్రం రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.


Sumitra

Sumitra

Next Story