తెలంగాణ ప్రజలకు చల్లని కబురు...రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు...రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని మంగళవారం వాతావరణ శాఖ వివరించింది.

మంగళవారం ఉదయం తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ ఎత్తు వరకు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అన్నారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా రాబోయే 48 గంటల్లో ప్రయాణించి బలపడే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ తెలిపింది.

ఇక మరో వైపు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుకురిసే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం కూడా ఒకట్రెం డుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం వివరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories