Temperature: సుర్రుమంటున్న సూరీడు..తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్

Temperature: భానుడు ప్రచండ నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి.

Update: 2021-03-29 05:56 GMT

Summer Heatwave (ఫైల్ ఇమేజ్)

Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రచండ నిప్పులు కురిపిస్తున్నాడు. వేసవికి ముందు నుంచే మార్చిలోనే ఎండలు దంచేస్తున్నాయి. ఎండ వేడికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు తీవ్ర ఉక్కపోత రాత్రివేళ కూడా ఊపిరి ఆడనివ్వట్లేదు. రెండ్రోజులుగా రాజస్థాన్ నుంచి వస్తున్న వేడిగాలులతో తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం పెరిగింది. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు మరింత అందోళన కలిగిస్తున్నాయి. సోమవారం నుంచి ఎండల తీవ్రత ఎక్కువకానుందని అధికారులు అంటున్నారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు పెరిగిపోతాయని వాతావరణ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయని అంటున్నారు. త్వరలో ఉష్ణోగ్రతలు దాదాపు 6 డిగ్రీల దాకా పెరుగుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎండల తీవ్రత పెరగనుంది.ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగానే ఉంటాయని భారత వాతావరణ విభాగం (IMD) చెబుతోంది. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణలో గత 24 గంటల్లో జగిత్యాలలోని అల్లిపూర్‌లో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. హైదరాబాద్‌లో త్వరలోనే 40 డిగ్రీలు దాటేస్తాయని చెప్పింది. ఈ కారణంగానే రాత్రి వేళ కూడా చల్లదనానికి బదులు వేడి ఉంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాయలసీమ, పల్నాడు, తెలంగాణలో 40 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. హైదరాబాద్‌లో సైతం 39 డిగ్రీలు నమోదవుతున్నాయి. అయితే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బలం కోసం కొబ్బరి నీళ్లు, ORS ప్యాకెట్లు తాగాలి. మనం చాలా త్వరగా డీ-హైడ్రేట్ మంచినీరు, మజ్జిగా, నిమ్మరసం వంటివి తీసుకోవాలని తెలియజేస్తున్నారు. కుండలో నీరు తాగుతూ ఉంటే అదే పనిగా దాహం వెయ్యదు. ఇక వీలైనంతవరకూ ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. తప్పనిసరై వెళ్లాల్సి వస్తే... తలకి టోపీ పెట్టుకోవాలి. లేదా గొడుగు వాడాలి.

Tags:    

Similar News