Tirumala: తిరుల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించామన్నారు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని.. ఆలయం అంతటా పవిత్ర సుగంధ ద్రవ్యాలతో శుద్ది కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అధికార యంత్రాంగం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేశామని అన్నారు.