తిరుమల పట్టు వస్త్రాల స్కామ్… అసలు ఎలా బయటపడిందంటే?
శ్రీవారి ప్రసాదంగా భావించే పట్టు వస్త్రాలు… భక్తుల దృష్టిలో దేవుని ఆశీర్వాదమే. అలాంటి పవిత్రమైన వస్త్రాల్లో పాలిస్టర్ కలపడం, దాదాపు పదేళ్లుగా భారీ స్థాయిలో అక్రమాలు జరగడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
తిరుమల పట్టు వస్త్రాల స్కామ్… అసలు ఎలా బయటపడిందంటే?
శ్రీవారి ప్రసాదంగా భావించే పట్టు వస్త్రాలు… భక్తుల దృష్టిలో దేవుని ఆశీర్వాదమే. అలాంటి పవిత్రమైన వస్త్రాల్లో పాలిస్టర్ కలపడం, దాదాపు పదేళ్లుగా భారీ స్థాయిలో అక్రమాలు జరగడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2010 నుంచి పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలు వెలుగుచూసాయి. ఈ భారీ కుంభకోణం ఎలా బయటపడిందో చూసేద్దాం…
స్కామ్‌పై టీటీడీకి అనుమానం ఎలా వచ్చిందంటే?
గత సెప్టెంబర్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదే ఏజెన్సీ నుంచి వ్యక్తిగత వినియోగం కోసం శాలువాలు కొనుగోలు చేశారు. ఒక్కో వస్త్రాన్ని రూ.350కే అందుకోవడంతో నాణ్యతపై అనుమానం కలిగింది. వెంటనే ఈ విషయాన్ని సెప్టెంబర్ 16న జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించి, విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు.
విజిలెన్స్ బృందం:
తిరుమల వైభవోత్సవ మండపం
తిరుపతి మార్కెటింగ్ విభాగం
నుంచి శాంపిల్స్‌ను సేకరించి, ధర్మవరం మరియు బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డులకు పరీక్షకు పంపింది.
అక్కడ వచ్చిన రిపోర్టు షాకింగ్!
టీటీడీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘన
టెండర్ ప్రకారం:
శుద్ధమైన మల్బరీ సిల్క్తోనే నేయాలి
కనీసం 31.5 డెనియర్ నూలు తప్పనిసరి
ఓం నమో వేంకటేశాయ చిహ్నాలు, శంకు–చక్రం తప్పనిసరి
పరిమాణం, బరువు, బార్డర్ అన్నీ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఉండాలి
కానీ VRS ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ఈ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు తేలింది.
అసలు పట్టు పేరు మీద 100% పాలిస్టర్ వస్త్రాలనే సరఫరా చేస్తూ టీటీడీని, భక్తులను మోసం చేస్తున్నారన్నది బోర్డు ఆరోపణ.
ఎంత పెద్ద స్కామ్ అంటే?
2015–2025 మధ్య:
రూ. 54.95 కోట్ల విలువైన వస్త్రాలు సరఫరా
ఒక్కో వస్త్రం అసలు విలువ రూ. 350–400
టీటీడీకి అమ్మిన ధర రూ. 1,400 వరకు
ఇప్పటివరకూ సుమారు 54 కోట్లు అవినీతి జరిగినట్లు టీటీడీ అంచనా వేసింది.
ఎవరిపై చర్యలు?
చర్యలు తీసుకున్న సంస్థలు:
VRS Exports
తిరుమల ఫ్యాబ్రిక్స్
VM రాజా పవర్ లూమ్స్
అలాగే కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఇచ్చిన అప్రూవల్ పై కూడా అనుమానం రావడంతో దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
టీటీడీ బోర్డు కేసును ACBకు అప్పగించింది.
పవన్ కళ్యాణ్ స్పందన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందిస్తూ—
టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని
కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతోనే ఇప్పుడు వరుసగా స్కామ్‌లు బయటపడుతున్నాయని
వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని
తెలిపారు.
భక్తులకు ఇబ్బంది ఉండదా?
టీటీడీ వద్ద ప్రస్తుతం 15 రోజుల వరకు సరిపడే వస్త్రాల నిల్వ ఉందని, అవే భక్తులకు వేదాశీర్వచనంలో ఇస్తున్నట్లు సమాచారం.
ఈ పట్టు వస్త్రాల స్కామ్‌పై జరుగు పూర్తి స్థాయి దర్యాప్తు మరిన్ని సంబంధిత అధికారుల పాత్రను కూడా వెలికితీయవచ్చన్న సమాచారం అందుతోంది.