Adulterated Ghee: కల్తీ నెయ్యి కేసు.. సిట్‌ కస్టడీకి ఇద్దరు నిందితులు

Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ పర్యవేక్షణలోని సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.

Update: 2025-12-09 11:21 GMT

Adulterated Ghee: కల్తీ నెయ్యి కేసు.. సిట్‌ కస్టడీకి ఇద్దరు నిందితులు

Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ పర్యవేక్షణలోని సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితులైన అజయ్, సుబ్రహ్మణ్యంను కస్టడీలోకి తీసుకుంది. నెల్లూరు జైలు నుంచి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్.. వారిని తిరుపతికి తరలించింది. రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన సిట్ అధికారులు.. అనంతరం కార్యాలయానికి తరలించారు. ఈనెల 12 వరకు ఏసీబీ కోర్టు అజయ్, సుబ్రహ్మణ్యంను కస్టడీకి ఇచ్చింది. కస్టడీలో కల్తీ నెయ్యికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టాలని సిట్ భావిస్తోంది. 

Tags:    

Similar News