Nara Lokesh: తమ్ముడు తిలక్ వర్మ.. నీ బహుమతి నాకెంతో ప్రత్యేకం
Nara Lokesh: 'Lokeshanna..! Neeko bahumati' అంటూ క్రికెటర్ తిలక్ వర్మ 'ఎక్స్'లో ఓ పోస్ట్ పెట్టారు.
Nara Lokesh: 'Lokeshanna..! Neeko bahumati' అంటూ క్రికెటర్ తిలక్ వర్మ 'ఎక్స్'లో ఓ పోస్ట్ పెట్టారు. ఆసియా కప్ ఫైనల్‌లో తాను ధరించిన టోపీని ప్రేమతో మంత్రి లోకేశ్‌కు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నారు.
దీనికి మంత్రి లోకేశ్ స్పందిస్తూ, "తమ్ముడు తిలక్ వర్మ ఇచ్చిన ఈ బహుమతి నాకెంతో ప్రత్యేకం. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతని చేతుల మీదుగానే క్యాప్‌ను అందుకుంటాను" అని 'ఎక్స్'లో రాసుకొచ్చారు.
ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ 69 నాటౌట్‌గా నిలిచి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.