నల్లమల అటవీ సమీప గ్రామాల పరిధిలో పులి సంచారం

* పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిపిన అటవీశాఖ అధికారులు * అడుగుజాడలను బట్టి పది సంవత్సరాల పులిగా గుర్తింపు * గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Update: 2020-12-31 05:33 GMT

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల అటవీ సమీప గ్రామమైన పెద్దూటి దగ్గర పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గ్రామానికి కేవలం అర కిలోమీటర్ దూరం వరకు వచ్చి వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.

పులి అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు సేకరించారు. అడుగుజాడలను బట్టి పులి వయస్సు దాదాపు 10 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేసారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల కాపరులు ఎవరూ అడవిలోకి ప్రవేశించరాదని హెచ్చరించారు. అడవిలో అరుదుగా కనబడే జంతువులు కూడా సంచరిస్తున్నట్లు తెలిపారు.


Full View


Tags:    

Similar News