ప్లాస్టిక్ ను పారద్రోలండి

నగర పంచాయతీలో ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు, వస్తువులను పూర్తిగా విడనాడాలని హెడ్ కానిస్టెబుల్ సీహెచ్ రమణ, కానిస్టేబుల్ బాబురావు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Update: 2019-11-25 08:56 GMT
హెడ్ కానిస్టెబుల్ సీహెచ్ రమణ, కానిస్టేబుల్ బాబురావు

పాలకొండ: నగర పంచాయతీలో ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు, వస్తువులను పూర్తిగా విడనాడాలని హెడ్ కానిస్టెబుల్ సీహెచ్ రమణ, కానిస్టేబుల్ బాబురావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధంపై పాలకొండలో గల వివేకానంద స్కూల్ లో విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పాలిథిన్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, అందరూ గుడ్డ, నార సంచులను వాడాలన్నారు.

Tags:    

Similar News