జనాలకు ఊరటనిచ్చే వార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

జనాలకు ఊరటనిచ్చే వార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం జనాలకు ఊరటనిచ్చే వార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

Update: 2019-08-26 01:23 GMT

ఏపీలో ప్రతినెలా రేషన్‌ కోసం EKYC తప్పనిసరి కావడంతో బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆధార్ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. దీంతో పిల్లలు మొదలు, పండు ముసలి వరకు గంటల తరబడి నమోదు కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి పగలు తేడాలేకుండా నమోదు కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. పిల్లలకు వేలి ముద్రలు పడకపోవడంతో వారందరినీ స్కూళ్లు మానిపించి నమెదు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల అవస్థలు గమనించిన ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. ఆధార్, ఈ–కేవైసీ నమోదుకు గడువు అనేది లేదని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, ఈ–కేవైసీ నమోదు, అప్‌డేట్‌ చేయించకపోయినా రేషన్‌ ఇస్తారని, రేషన్‌ ఇవ్వరనే వదంతులను నమ్మవద్దని పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని, కమిషనర్ శశిధర్‌ స్పష్టం చేశారు. కార్డులోని కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరికి ఈకేవైసీ ఉన్నా రేషన్‌ సరుకులు ఇస్తామన్నారు. 

Tags:    

Similar News