chandrababu Naidu: క్షమించరాని నేరం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
chandrababu Naidu: కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెట్టారు
Laddu Dispute: లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలన నిర్ణయం..నేడు తిరుమలలో ప్రత్యేక హోమం
chandrababu Naidu: తిరుపతి లడ్డూ ప్రసాదంలో నాసిరకం నెయ్యి వాడారని మరోసారి ఆరోపించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 320 రూపాయలకు వస్తుందని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టారన్నారు.
తానేం తప్పు చేయలేదని ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నారు.. టెండర్లు తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు చంద్రబాబు. 320 రూపాయలకే నెయ్యి వస్తుందంటే ఆలోచించాల్సిన అవసరం లేదా అని జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో దర్శనాలు, భోజనాలు కూడా సరిగా లేవన్నారు చంద్రబాబు.