Eluru: కన్న కూతుళ్లను తన రెండవ భర్త పరం చేసిన తల్లి.. ఇద్దరు మైనర్లను గర్భవతులను చేసిన మారుతండ్రి..

Eluru: వట్లూరు గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు కుమార్తెలు

Update: 2023-07-14 09:00 GMT

Eluru: భార్య మొదటి భర్త కుమార్తెలపై రెండో భర్త కొన్నేళ్లుగా లైంగిక దాడి.. షాకింగ్ విషయం ఏంటంటే..?

Eluru: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలతో దారుణానికి ఒడిగట్టింది ఓ తల్లి. సభ్యసమాజం తలదించుకునేలా.. కూతుళ్లపై అమానవీయంగా ప్రవర్తించింది. పిల్లల భవిష్యత్‌ను గాలికొదిలేసి.. వారి జీవితాన్ని తన రెండో భర్తకు బలి పెట్టింది. ఈ ఘటన ఏలూరు జిల్లా వట్లూరులో చోటుచేసుకుంది.

వట్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమె మొదటి భర్త 2007లో మరణించడంతో సతీష్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పటినుంచి తన ఇద్దరు కుమార్తెలను విశాఖపట్నంలోని తన పుట్టింట్లో వదిలేసింది. అయితే సతీష్‌ను పెళ్లి చేసుకునే సమయానికే ఆ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడంతో.. సతీష్ పిల్లల కోసం మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పాడు. అందుకు ఆ మహిళ తన కన్న కూతుళ్లనే బలి చేసింది. తండ్రిలా పిల్లల భద్రత చూసుకోవాల్సిన మారు తండ్రి అమానుషానికి కన్నతల్లి కూడా తోడైంది. తన పిల్లల ద్వారా పిల్లలను పొందాలని సతీష్ దగ్గరకు తన కూతుళ్లను బలవంతంగా పంపింది.

అందుకు తన పెద్ద కూతురు ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో పుట్టింటి నుంచి తీసుకొచ్చిన మహిళ.. తన భర్త వద్దకు బలవంతంగా పంపింది. కూతురు ప్రతిఘటించడంతో ఇద్దరూ చావబాదారు. ఆ తర్వాత పెద్ద కూతురు గర్భం దాల్చగా చదువు ఆగిపోయి.. విషయం బయటకు తెలుస్తుందని అబార్షన్ చేయించారు. ఆ తర్వాత పదో తరగతి చదువుతున్న సమయంలో మరోసారి గర్భం చేశారు. అయితే ఆడపిల్ల పుట్టడంతో తనకు మగ శిశువు కావాలని అడిగాడు సతీష్. అందుకు తన రెండో కూతురును కూడా బలిపెట్టింది మహిళ. ఆమె గర్భం దాల్చగా ప్రాణం లేని శిశువు జన్మించాడు. దాంతో ఆ శిశువును కాలువలో పడేశారు.

ఇక భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో మహిళ పుట్టింటికి వెళ్లింది. భర్త సతీష్‌పై వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత భార్య కూతుళ్లను తీసుకొని వచ్చి సతీష్ వేధించడం ప్రారంభించాడు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం మేనమామకు తెలియడంతో ఆ ఇద్దరు పిల్లలను తీసుకొని దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. దీంతో దిశ పోలీసులు సతీష్‌తో పాటు అతని భార్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు విచారణలో ఆ మహిళ పెద్ద కుమార్తె మూడు నెలల గర్భవతిగా గుర్తించారు పోలీసులు. 

Tags:    

Similar News