Parvathipuram: సారా తయారీదారులకు చుక్కలు.. ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి
Parvathipuram: ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు గ్రామాల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు. 26 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం.
Parvathipuram: సారా తయారీదారులకు చుక్కలు.. ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి
Parvathipuram: నవోదయం 2.0 కార్యక్రమంలో అమలు లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ బి.శ్రీనాథుడు ఆదేశములు మేరకు ఆంధ్రా - ఒడిస్సా సరిహద్దులో గల నాటు సారా తయారీ స్థావరాలు కలిగిన సందుబడి గ్రామంలో ఆంధ్ర ఎక్సైజ్ శాఖ, ఒడిస్సా ఎక్సైజ్ శాఖ తో కలిసి సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 26,000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసారు.
రవాణా కు సిద్ధంగా ఉంచిన 420 లీటర్ల నాటు సారాను , 50 కేజీలు అమ్మోనియా ను స్వాధీనం చేసుకునీ వాటితో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఒడిస్సా ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో కురుపాం ఎక్సైజ్ సిబ్బంది, పార్వతీపురం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, బోర్డర్ మొబైల్ పార్టీ పాలకొండ, సీతానగరం, రాజాం, చీపురుపల్లి, ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది, విజయనగరం ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
అలానే నాటు సారా పై సరిహద్దులో నిరంతర నిఘా పెడుతున్నామని , ఈ క్రమంలో ప్రజలు నాటు సారా తయారీ - రవాణా - అమ్మకాలు చేసే వారిపై ఫిర్యాదులు 6302936599 ఫోన్ నెంబర్ కు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కురుపాం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు.