ఏపీలో ముగిసిన మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరున్నరకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగింది. మధ్యాహ్నం మూడున్నర తర్వాత క్యూలైన్లో నిల్చున్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఇక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒకటిన్నరలోపే పోలింగ్ ప్రక్రియను ముగించారు. మూడో దశలో 2639 సర్పంచ్, 19,533 వార్డులకు ఎన్నికలు జరగగా అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60శాతం అత్యల్పంగా విశాఖ జిల్లాలో 65శాతం పోలింగ్ నమోదైంది.