CM Camp Office: తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వైసీపీ ఎమ్మెల్యేల క్యూ
CM Camp Office: ఎంపీ భరత్‌ను రాజమండ్రి సిటీకి పంపాలని అధిష్టానం నిర్ణయం
CM Camp Office: తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వైసీపీ ఎమ్మెల్యేల క్యూ
CM Camp Office: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇవాళ కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో క్యాంపు ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఇందులో భాగంగానే పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి చేరుకున్నారు. క్యాంపు ఆఫీసుకు చేరుకున్నవారిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్‌రెడ్డి, పాతపత్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చేరుకున్నారు. అయితే మార్పులు, చేర్పుల్లో భాగంగా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి మరొకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ భరత్‌ను రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానానికి పంపించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం జగన్ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఎప్పుడు.. ఎవరికి.. సీఎంవో నుంచి సమాచారం వస్తుందోనని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.