Anantapur: దొంగలు దొరికారు.. ఘటన జరిగిన 12 గంటల్లోనే బట్టబయలు చేసిన పోలీసులు
Anantapur: చాకచక్యంగా వ్యవహరించి అసలు విషయం తేల్చిన పోలీసులు
Anantapur: దొంగలు దొరికారు.. ఘటన జరిగిన 12 గంటల్లోనే బట్టబయలు చేసిన పోలీసులు
Anantapur: అనంతపురంలో నిన్న జరిగిన చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే పోలీసులు కేసును బట్టబయలు చేశారు. దొంగతనానికి సంబందించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నగరంలోని ఐడీబీఐ బ్యాంకు ఆవరణలో చోరీ కలకలం రేపింది. పోతురాజు అనే వ్యక్తి నగదును బ్యాంకులో జమ చేయడానికి వచ్చాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళలో కారం కొట్టి, నోటికి ప్లాస్టర్ బిగించి 46 లక్షల నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారంటూ సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకు ఆవరణలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఎల్ఐసీ పాలసీదారులు చెల్లించిన 46 లక్షలను బ్యాంకులో జమ చేసేందుకు వెళుతుండగా దొంగలించారంటూ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్‌కు చెందిన పోతురాజు ఫిర్యాదు చేశాడు. అయితే డబ్బు కోసం పోతురాజు డ్రామా ఆడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొంతనలేని సమాధానాలు చెప్పటంతో పోతురాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం స్నేహితులతో కలిసి చోరీ డ్రామా ఆడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.