Andhra Pradesh: ఏపీలో ఆగని 'పది' పరీక్షపత్రాల లీకులు..?
Tenth Paper Leak: ఏపీలో పదో తరగతి పరీక్షాపత్రాల లీకేజీ ఘటనలు కలకలం రేపుతున్నాయి.
Andhra Pradesh: ఏపీలో ఆగని 'పది' పరీక్షపత్రాల లీకులు..?
Tenth Paper Leak: ఏపీలో పదో తరగతి పరీక్షాపత్రాల లీకేజీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే పేపర్ లీక్ అవుతున్నాయి. రోజుకో ప్రాంతంలో ప్రశ్నపత్రం లీకేజీ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరులో టెన్త్ పేపర్ లీకైందని ఆరోపణలు వచ్చాయి. ఓ పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల సెల్‌ఫోన్‌లో సోమవారం నాటి గణితం ప్రశ్నాపత్రం ఉంది. ప్రశ్నాపత్రం లీకేజీపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆలూరు చేరుకుని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఇద్దరు యువకులను విచారించారు. తాము పరీక్ష కేంద్రంలోని విద్యార్థుల నుంచి గణితం ప్రశ్నాపత్రం ఫొటో తీసుకున్నట్లు యువకులు అంగీకరించారు.