Kethireddy Pedda Reddy: ఏం చేయాలో అదే చేస్తా...
Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
Kethireddy Pedda Reddy: ఏం చేయాలో అదే చేస్తా...
Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు రావడంతో.. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, తాడిపత్రి ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌లు పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీంతో అధికారులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు.
తన ఇంటికి ప్లానింగ్ ఉందో లేదో అధికారులే తేల్చి చెప్పాలని.. ప్రతి నివేదికను తనకు అందించాలని డిమాండ్ చేశారు. ఏ వైపు కొలిచినా.. కొలతల తర్వాత తనకు రాతపూర్వకంగా నివేదిక అందిస్తే.. తాను ఏం చేయాలో అదే చేస్తాననంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.