Hindupur Municipal Chairman: హిందూపురంలో రసవత్తర రాజకీయం..

Hindupur Municipal Chairman: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ పాలకవర్గ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Update: 2025-02-03 02:40 GMT

Hindupur Municipal Chairman: హిందూపురంలో రసవత్తర రాజకీయం..

Hindupur Municipal Chairman: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ పాలకవర్గ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశంపార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ వార్డు కౌన్సెలర్లతో సత్య సాయి జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ సమావేశమై దిశానిర్ధేశం చేశారు.

సాధారణ ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుంచి మున్సిపల్ కౌన్సిలర్లు 13 మంది తెలుగుదేశంపార్టీలో చేరారు. వీరందరికీ విప్ జారీ చేస్తున్నట్టు తెలిపిన ఉషా చరణ్ తెలిపారు.

ఈరోజు హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ఉషాశ్రీ చరణ్ తెలిపారు. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఉషాశ్రీచరణ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. వార్డు కౌన్సిలర్లు తమవైపే ఉన్నందువల్ల మున్సిపల్ ఛైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమావ్యక్తంచేశారు.

ఇక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ పై ఫ్యాన్ గుర్తు పై గెలిచిన కౌన్సిలర్లను భయపడి క్యాంపుకు తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నాం అని అన్నారు.

Tags:    

Similar News