AP Assembly Live: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్.. లోకేష్ నిరసన ర్యాలీ...
AP Assembly Live: *గోవిందా గోవిందా అంటూ నినాదాలు *తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు
AP Assembly Live: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్.. లోకేష్ నిరసన ర్యాలీ...
AP Assembly Live: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ ఎమ్మెల్యేల పట్టుబట్టారు. చర్చకు అంగీకరించకపోవడంతో టీడీపీ సభ్యులు సభనుంచి వాకౌట్ అయ్యారు. ఇక అంతకుముందు నారా లోకేష్ నిరసన ర్యాలీతో అసెంబ్లీకి చేరుకున్నారు. మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు.
తాళిబొట్లు పట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. 42 మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి వరకు ర్యాలీగా వెళ్లారు. కల్తీ నాటుసారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అని ప్లకార్డులు ప్రదర్శించారు. కల్తీసారా బాధిత కుటుంబాలకు 25లక్షల పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.