అసెంబ్లీలో TDP సభ్యుల బాదుడే బాదుడు నినాదాలు.. సభ నుంచి TDP MLAల సస్పెన్షన్
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.
అసెంబ్లీలో TDP సభ్యుల బాదుడే బాదుడు నినాదాలు.. సభ నుంచి TDP MLAల సస్పెన్షన్
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా అడ్డుపడుతున్నారన్నారు. సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు.