Pulivarthi Nani: జగన్ నడి సముద్రంలో దూకడం మంచిది
Pulivarthi Nani: అనంతపురంలో ఇటీవల జరిగిన 'సూపర్ సిక్స్' సభ విజయాన్ని తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని (చంద్రగిరి), కలికిరి మురళీమోహన్ (పూతలపట్టు) తీవ్రంగా విమర్శించారు.
Pulivarthi Nani: జగన్ నడి సముద్రంలో దూకడం మంచిది
Pulivarthi Nani: అనంతపురంలో ఇటీవల జరిగిన 'సూపర్ సిక్స్' సభ విజయాన్ని తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని (చంద్రగిరి), కలికిరి మురళీమోహన్ (పూతలపట్టు) తీవ్రంగా విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు జగన్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పులివర్తి నాని వ్యాఖ్యలు:
జగన్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే 'సూపర్ సిక్స్' సభపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని నాని అన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ సాధించిన అభివృద్ధి ఏమీ లేదని, మెడికల్ కాలేజీలు కట్టేశామని చెబుతున్నది పచ్చి అబద్ధమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరతకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కారణమని, తమ కూటమి ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు.
కలికిరి మురళీమోహన్ వ్యాఖ్యలు:
జగన్ ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, పెట్టుబడిదారులను బెదిరించిన ఆయన తీరు సరికాదని మురళీమోహన్ విమర్శించారు. జగన్ తన సొంత పత్రికలో 'సూపర్ సిక్స్' సభపై అసత్యాలు రాయించారని, ఆయన పగటి కలలు కనడం మానుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దళితులపై అక్రమ కేసులు బనాయించిన జగన్, ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నామని చెప్పడం "దెయ్యాలు వేదాలు వల్లించినట్లు" ఉందని ఎద్దేవా చేశారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన 217 మంది రాష్ట్ర యాత్రికులను నారా లోకేశ్ చొరవతో సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.