మైనర్‌ బాలికపట్ల టీడీపీ నేత కీచకపర్వం..!

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు కీచక చేష్టలతో సంచలనం రేపాడు.

Update: 2025-10-22 12:30 GMT

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు కీచక చేష్టలతో సంచలనం రేపాడు. మైనర్ బాలికను సపోటా తోటకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. సమయానికి అప్రమత్తమైన స్థానికులు బాలికను రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నారాయణరావు, తన చర్యలపై ప్రశ్నించిన స్థానికులను కూడా బెదిరించాడు. “నేనెవరో తెలుసా... టీడీపీ కౌన్సిలర్‌ని” అంటూ హెచ్చరించిన అతని ప్రవర్తనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో తుని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది.

Tags:    

Similar News