టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు షాక్‌.. వైసీపీలో చేరిన సోదరుడు

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు చూసిన ఆ పార్టీకి తాజాగా నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడి బయటకుపోవడం పెద్ద తలనొప్పిగా మారింది.

Update: 2019-11-04 12:13 GMT

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్నకు షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు చూసిన ఆ పార్టీకి, తాజాగా నాయకులు ఒక్కొక్కరు రాజీనామా చేసి బయటకుపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు టీడీపీ వీడారు. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్ఛుకున్నారు. సీఎం జగన్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సన్యాసిపాత్రుడితోపాటు, అతని భార్య అనిత, జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే సన్యాసిపాత్రుడు రాజీనామా చేయడం గమనార్హం. గత కొంతకాలంగా పార్టీ తనకు ప్రాదాన్యం ఇవ్వడం లేదని సన్యాసిపాత్రుడు రాజీనామా చేసిన సంగతి తెలసిందే. తాను పోయేవరకూ ఒకే కండువా కప్పుకుంటాను, స్వార్థాల కోసం రాజకీయాల పార్టీలు మారను అంటూ గతంలో అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 




 


Tags:    

Similar News