జమ్మలమడుగులో టీడీపీకి షాక్ .. వైసీపీలోకి రామసుబ్బారెడ్డి

Update: 2020-03-09 05:32 GMT

వైఎస్ఆర్ (కడప) జిల్లా జమ్మలమడుగు లో పెను సంచలనం చోటుచేసుకోబోతోంది. కరుడుగట్టిన టీడీపీ వాదిగా ముద్రపడిన మాజీ మంత్రి పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి నేడో రేపో వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగులోని తన అనుచరులతో సమావేశం అయిన ఆయన వైసీపీలో చేరాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రెండు నెలల కిందటే వైసీపీ నేతలతో రామసుబ్బారెడ్డి సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఆయన రాకను ఎమ్మెల్సీ దేవగుడి శివనాధరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ శివనాధరెడ్డి మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు.

ఆయన అనధికారికంగా వైసీపీలో కొనసాగుతోన్నారు. ఈ తరుణంలో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరతారని వార్తలు రాగానే ఆయన వర్గం అసంతృప్తికి లోనయింది. మరోవైపు రామసుబ్బారెడ్డి టీడీపీ ని వీడటం ఖాయం కావడంతో ఆ పార్టీకి ఇంచార్జ్ కరువయ్యారు. ఆదివారమే టీడీపీ అధిష్టానానికి చెందిన కొందరు పెద్దలు రామసుబ్బారెడీ తో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కూడా జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జిగా మహిళా నేత పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.  

Tags:    

Similar News