Konalalla Narayana commet on kollu ravindra arrest : రాజకీయ కక్షతోనే రవీంద్రను అరెస్ట్ : మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

Konalalla Narayana commet on kollu ravindras arrest : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడు, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది.

Update: 2020-07-04 13:18 GMT

 Konalalla Narayana commet on kollu ravindras arrest: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడు, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని అన్నారు. కనీస విచారణ కూడా జరపకుండా అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

జోలికి రవీంద్ర వివాదాల జోలికి వెళ్లే మనస్తత్వం కాదని, నిందితులు చెప్పారని, దాన్ని ప్రామాణికంగా తీసుకుని అదుపులోకి తీసుకోవడం సరికాదని కొనకళ్ల నారాయణ అన్నారు. సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాలనే ధోరణి ఆయనదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే తప్పుడు కేసులను బనాయిస్తున్నారని ఆయన చెప్పారు. బీసీలను టార్గెట్ చేసి, వరుసగా కేసులు పెడుతున్నారని నారాయణ విమర్శించారు.

కాగా.. కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు మోకా భాస్కర్‌రావు హత్య కేసుకు సంబంధించి పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు బయపటడుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News